సంక్షేమ బాలికల కళాశాలను సందర్శించిన కలెక్టర్

సంక్షేమ బాలికల కళాశాలను సందర్శించిన కలెక్టర్

హనుమకొండ: జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్ లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో నేడు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్ ఎంసెట్లకు దరఖాస్తు చేశారా అని విద్యార్థులను అడిగి సమాచారాన్ని తెలుసుకున్నారు. చక్కటి ఫలితాలు సాధించేలా విద్యార్థులు చదువుకోవాలని కలెక్టర్ కోరారు.