114 సర్పంచ్ స్థానాలు.. అందులో 54మహిళలకే
ASF: జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరగనున్న 5 ఏజెన్సీ మండలాల్లో మొత్తం 114 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో 54 గ్రామ పంచాయతీ స్థానాలను మహిళలకు కేటాయించారు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అవకాశం రావడంతో మహిళలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ముందుకొస్తున్నారు. భార్యలకు అవకాశం దక్కడంతో వారి భర్తలు తమ గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు.