రాయపర్తి గురుకుల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీ కోసం దరఖాస్తు గడువు జనవరి 25 వరకు పొడిగించబడింది. గత నెల 11 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రన్స్ పరీక్ష వచ్చే నెల ఫిబ్రవరి 22న నిర్వహించినట్లు బుధవారం ప్రిన్సిపల్ సరిత తెలిపారు.