సంతోషిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

సంతోషిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

SKLM: పాత శ్రీకాకుళంలో వెలసిన శ్రీ సంతోషి మాత అమ్మవారికి శ్రావణ మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. వేకువ జామున 4 గంటల నుంచి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.