అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

JGL: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోనీ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పుష్య మాసం కృష్ణ పక్షం బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి గుండి అశ్విన్ శర్మ వేదమంత్రాల మధ్య పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. అలంకరణ అనంతరం స్వామి అష్టోత్తర శతనామార్చనలు, ధూప దీప నైవేద్యం సమర్పించారు.