మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన
SRCL: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమండ్లు అన్నారు. సిరిసిల్లలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు శుక్రవారం నోరుకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం హనుమండ్లు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ అమలు కొరకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించాలన్నారు.