ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి

సత్యసాయి: విజయవాడ నుంచి ఉండవల్లికి వెళ్తూ మంత్రి సవిత బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, స్త్రీశక్తి పథకం కింద లభిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై మహిళల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయగా, మహిళలు ఉచిత ప్రయాణం సహా పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.