కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

ప్రకాశం: దర్శి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుప్పాల వీరనారాయణ శనివారం ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పొదిలి రోడ్డులోని సాగర్ కాలువ లైన్‌లో గల విద్యుత్ కార్యాలయం వద్ద యువకుని మృతదేహం లభ్యమైంది.