రోడ్డు ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి
AP: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. అధికారులు ఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని నిమ్మల ఆదేశించారు. బాధితులకు అవసరమైన సాయం చేయాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.