కొత్తవలసలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు

కొత్తవలసలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి కుమ్మరివీధిలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. స్థానికుల వివరాల మేరకు.. శ్రీకాకుళపు శ్రీనివాస్ పని నిమిత్తం పద్మనాభం మండలం మద్ది వెళ్ళారు. ఆయన కుమారుడు సోమవారం సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు విరగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బీరువాలో ఉంచిన సుమారు పది తులాల బంగారం అపహరించుకుపోయారు.