రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం

SDPT: బెజ్జంకి మండలంలో రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న ఫార్చునర్ కారు బెజ్జంకి క్రాసింగ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు కరీంనగర్ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు.