VIDEO: సమస్యలపై ఇందిరాపార్క్ వద్ద ధర్నా
KMM: జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TUWJ ఆధ్వర్యంలో HYD ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ ఏనుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు.