పులివెందుల PSలో రాధాకృష్ణపై ఫిర్యాదు
KDP: ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై పులివెందులలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకర రీతిలో ఏబీఎన్ కథనాలను ప్రసారం చేస్తుందని వారు మండిపడ్డారు. ఈ మేరకు రాధాకృష్ణపై, ఆ ఛానెల్ ప్రతినిధులపై కేసు నమోదు చేయాలని పులివెందుల పోలీస్ స్టేషన్‌లో నాయకులు ఫిర్యాదు చేశారు.