నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హన్మకొండ పట్టణంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని టౌన్ DE సాంబ రెడ్డి తెలిపారు.పెద్దమ్మగడ్డ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ ఫీడర్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఉ.8 నుంచి 10 గంటల వరకు, KUC సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8 నుంచి 10 వరకు, సోమిడి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.