కంపు కంపుగా మురికి కాలువలు.. పట్టించుకోని అధికారులు

కంపు కంపుగా మురికి కాలువలు.. పట్టించుకోని అధికారులు

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో మురికి కాలువలు కంపు కొట్టిస్తున్నాయి. ప్రధాన రహదారి పక్కనే మురికి కాలువలు కంపు కంపుగా ఉండడంతో బాటసారులు ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.