ఘనగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనగా మహిళా దినోత్సవ వేడుకలు

JGL: ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.