ముస్లింల ప్రత్యేక ప్రార్థనలకు స్థలం కేటాయింపు

ముస్లింల ప్రత్యేక ప్రార్థనలకు స్థలం కేటాయింపు

KMM: వైరా ముస్లిం సోదరులకు పండుగ సమయంలో ప్రార్థన చేయుటకు వైరాలోని చెరువు బజార్‌లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం ముస్లింలకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రార్థనలకు స్థలం లేక ఇబ్బంది పడుతున్న తమకు స్థలాన్ని కేటాయించిన ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.