పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని వినతి

పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని వినతి

MNCL: భీమారం మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని బీజేపీ భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శేఖర్ కోరారు. ఈ మేరకు మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.