ఫ్రాన్స్‌లో మిలటరీ వాలంటీర్లు

ఫ్రాన్స్‌లో మిలటరీ వాలంటీర్లు

ఫ్రాన్స్‌లో మిలటరీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ వెల్లడించారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువత సైన్యంలో చేరి, 10 నెలలు పనిచేయాలని అన్నారు. మిలటరీ యూనిఫామ్ ధరించి ప్రధాన భూభాగంలోనూ, ఫ్రాన్స్‌ ఆధీనంలోని ఇతర ప్రాంతాల్లోనూ పనిచేయాలన్నారు. వచ్చే ఏడాది తొలి విడతగా 3,000 మందిని వాలంటీర్లుగా తీసుకుంటామని చెప్పారు.