VIDEO: 'ఎన్నికల విధులకు ఆటకు కలిగిస్తే కఠిన చర్యలు'
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో భూపాలపల్లి మండలం కొంపెల్లి, గొర్లవీడు, నేరేడుపల్లి పోలింగ్ సెంటర్లను ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ ఎన్నికల నియమావళి పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని, ఎన్నికల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.