పుంగనూరులో ఘనంగా 'కార్పెంటర్స్ డే'

పుంగనూరులో ఘనంగా 'కార్పెంటర్స్ డే'

పుంగనూరులో కార్పెంటర్స్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధోబి కాలనీ వృద్ధాశ్రమంలో కార్పెంటర్లు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. యాచకులకు వస్త్రాలు అందజేశారు. కార్పెంటర్ల కమ్యూనిటీ భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని పాలకులు, అధికారులను కోరారు. ప్రతి నెలా చివరి ఆదివారం సంఘ సమావేశం నిర్వహిస్తామన్నారు.