సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన రవీంద్రనాథ్

సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన రవీంద్రనాథ్

కడప జిల్లాలోని సీఎం చంద్రబాబు పర్యటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గురువారం తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది సీఎం పర్యటన కాదని, చీకటి దొంగ పర్యటనలా ఉందని అన్నారు. మహానాడు నిర్వహించినా కడప జిల్లాకు ఒరిగిందేమీ లేదని, రైతాంగాన్ని ఆదుకోలేదని, ఉక్కు ఫ్యాక్టరీకి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, మాటలు తప్ప చేతల్లో శూన్యమని ఆయన విమర్శించారు.