అక్రమ ఇసుక తరలింపు.. రెండు ట్రాక్టర్లు సీజ్
MDK: పెద్ద శంకరంపేట మండల పరిధి వీరోజిపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేసినట్లు తహసీల్దార్ ప్రభుదాస్ తెలిపారు. చెరువుల నుంచి అక్రమంగా జేసీబీ సహాయంతో ఇసుకను ట్రాక్టర్లను తరలిస్తుండడంతో సీజ్ చేసినట్లు వివరించారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.