బుద్ధ వనంలో రేపు ధమ్మవిజయం వేడుకలు
NLG: నాగార్జునసాగర్ బుద్ధవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లు బుధవారం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఈరోజు తెలిపారు. బుద్ధుడి ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయ స్థానంలో, దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.