రేపు తాడిప్రతిలో పోటాపోటీగా కార్యక్రమాలు

రేపు తాడిప్రతిలో పోటాపోటీగా కార్యక్రమాలు

ATP: రేపు తాడిప్రతిలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తహసీల్దార్‌లకు వైసీపీ వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉండగా, టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేయనున్నారు. ఒకే సమయంలో ఇరుపార్టీల కార్యక్రమాలు ఉండగా వీరి మధ్య విభేదాలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.