పైపు లైన్‌కు మరమ్మతులు పూర్తి.. నీటి సరఫరా పునరుద్ధరణ
ASF: సిర్పూర్ పట్టణం పాత వాటర్ ట్యాంక్ కూల్చివేయడంతో మిషన్ భగీరథ పైపు లైన్, గేట్ వాల్ ధ్వంసం కాగా, 3 రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. స్పందించిన అధికారులు మరమ్మతు పనులు పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు పంచాయతీ కార్యదర్శి తిరుపతి తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పైప్ లైన్లు మరమ్మతులు చేస్తున్నామన్నారు.