స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
SKLM: ఆముదాలవలస పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ శుభ్రత పట్ల చైతన్యం పెంపొందించుకోవాలని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత అని సూచించారు.