'స్కావెంజర్ వేతనాలు విడుదల'

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం నియమించుకున్న పారిశుధ్ధ్య కార్మికుల ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి వారికి చెల్లించాలని సూచించారు.