మే 9న జాతీయ లోక్ అదాలత్
VSP: వచ్చే నెల 9న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు. రాజీ పడదగ్గ కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. తక్కువ సమయంలో, ఖర్చు లేకుండా వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని తెలిపారు.