మూడు రోజులపాటు ఆధార్ సవరణ క్యాంపులు

PDPL: ఆగస్టు 21 నుంచి 23 వరకు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాలు, పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్యాలయాలలో ఆధార్ సవరణ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధార్ వివరాలు సరిచేసుకోవాలని ఆయన సూచించారు.