పమిడిపాడలో ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ
BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఇవాళ ఉదయాన్నే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సచివాలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించి స్వయంగా పెన్షన్ దారులకు నగదును అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేస్తున్నట్లు సచివాలయ అధికారి పోతురాజు తెలిపారు.