ఎన్నికల్లో ఓటమి.. ఆర్జేడీ తొలి స్పందన

ఎన్నికల్లో ఓటమి.. ఆర్జేడీ తొలి స్పందన

బీహార్ ఎన్నికల్లో ఓటమిపై ఆర్జేడీ తొలిసారి స్పందించింది. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమని పేర్కొంది. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని దాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తెలిపింది. తమ పార్టీకి ఓటమితో విచారం, గెలుపుతో అహంకారం ఉండదని స్పష్టం చేసింది. ఆర్జేడీ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుందని వెల్లడించింది.