మహిళ లేనిదే మనుగడ లేదు: డా.కేశవులు ముదిరాజ్
NLG: మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డా. బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణం మర్రిగూడ MVR గెలాక్సీ పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.