నేడు నుంచి తేలప్రోలు రంగమ్మ తల్లి తిరుణాలు
కృష్ణా: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తల్లి తిరునాళ్ళు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ తిరణాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. అమ్మవారిని ఉయ్యాల ఉపే కార్యక్రమంలో పాల్గొంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.