నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: వింజమూరులో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికల మరమ్మతులు జరుగుతున్నాయి. శని, ఆదివారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీసీ కాలనీ, సుజాతనగర్, జైభీం నగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని ఏఈఈ షేక్ నాగూర్వలి ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు పూర్తి చేసి త్వరగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.