VIDEO: విద్యా వ్యవస్థ పై ఆదివాసీ నిర్మాణ సేన ఆందోళన

MLG: జిల్లాలో ఆదివాసీ నిర్మాణ సేన (ANS) నాయకులు DEO సిద్ధార్థ రెడ్డికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ANS రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.