రామేశ్వర దేవస్థానంలో మోక్షద ఏకాదశి పూజలు
ATP: రాప్తాడు మండల కేంద్రంలోని రామేశ్వర దేవస్థానంలో సోమవారం మోక్షద ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శివ దీక్ష స్వాములు స్వామివారికి గణపతి మహా పూజ, శివ పూజ, తదితర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. భక్తి శ్రద్ధలతో మోక్షదా ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి మరణానంతరం మోక్షం లభిస్తుందని విశ్వాసం అన్నారు.