రుషికొండ ఐటీ హిల్స్‌కు రెండు బస్సులు
VZM: రుషికొండ ఐటీ హిల్స్‌కు వెళ్ళే ఉద్యోగుల సౌకర్యార్థం కొత్తవలస నుంచి రెండు ఆర్టీసీ బస్సులను ప్రారంభించినట్లు సింహాచలం డిపో ప్రబంధకుడు ఎస్.శరత్ బాబు సోమవారం తెలిపారు. మొదటి బస్సు కాంప్లెక్స్‌లో ఉదయం 8 గంటలకు, రెండో బస్సు 8.20 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఐటీ హిల్స్‌లో సాయంత్రం 5.30, రెండో బస్సు 5.45 బయలుదేరుతుందని తెలిపారు.