ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ తనిఖీ
కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఐ డా.వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్‌తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్ (F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను పాటించాలన్నారు.