బ్యాంకు లింకేజీ ప్రక్రియ 100% పూర్తి చేయాలి: కలెక్టర్
ASF: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. స్త్రీ నిధి రుణాలు, యూడీఐడీ పెన్షన్, నూతన గ్రూపుల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.