VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
WGL: వర్ధన్నపేట పట్టణంలో అదనపు ఎస్సై మెరుగు రాజు మంగళవారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం ప్రాణాలకు ప్రమాదమని, కుటుంబ భద్రతను కాపాడటానికి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.