బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన మండలాలు

ELR: పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ స్పిల్‌వే వద్ద 32.20 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.