మీ పిల్లలకు కూడా ఇలాంటి భోజనమే పెడతారా..?
BDK: దమ్మపేట గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పిల్లలకు కూడా ఇలాంటి భోజనమే పెడతారా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.