కాసేపట్లో బీహార్‌లో తొలి విడత ఎన్నికలు
కాసేపట్లో బీహార్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే భద్రతా కారణాలతో 56 కేంద్రాల్లో సాయంత్రం 5 వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, తొలివిడతలో 121 నియోజకవర్గాలకు గాను.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.