కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

SRPT: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఉప్పతల లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసునన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.