జిల్లా కేంద్రంలో ఘనంగా పుస్తక దినోత్సవం

జిల్లా కేంద్రంలో ఘనంగా పుస్తక దినోత్సవం

VZM: జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డా మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ.. మంచి పుస్తకాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు మంచి స్నేహితుడుగా ఉంటాయన్నారు. రామాయణ, మహాభారతాలు వంటి గ్రంథాలు చదవడం అలవాటు చేసుకోవాలని ఇది విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలియజేశారు. అనంతరం పలువురు రచయితలను సత్కారించారు.