సుబ్బారాయునిపల్లిలో నేరాలపై అవగాహన సదస్సు

సుబ్బారాయునిపల్లిలో నేరాలపై అవగాహన సదస్సు

సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సుబ్బారాయునిపల్లి గ్రామంలో గురువారం రాత్రి నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ విజయ్ కుమార్ గ్రామ ప్రజలకు ఆస్తి నేరాలు, సైబర్ మోసాలు, అక్రమ కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని కోరారు.