VIDEO: వేషం అదిరే.. కోతులు బెదిరే

VIDEO: వేషం అదిరే.. కోతులు బెదిరే

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో పంటలపై, ప్రజలపై దాడులు చేస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి ఆదివారం వినూత్న ప్రయత్నం చేశారు. గ్రామపంచాయతీ కార్మికుడికి ఎలుగుబంటి వేషం ధరించి గ్రామంలోని వీధుల్లో తిరగబెట్టడం ద్వారా కోతులు భయాందోళనతో పరుగులు తీశాయి. గ్రామస్తులకు కొంత ఉపశమనం లభించిందని సర్పంచ్ అన్నారు.