బస్సు ఢీకొని వ్యక్తి మృతి
E.G: ఉండ్రాజవరం మండల కేంద్రంలోని శ్రీరామ హోటల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన ఆరుట్ల సూర్యనారాయణ (58) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, తణుకు నుంచి రాజమండ్రి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంట్లో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.