కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

RR: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌లోని ఓ కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.